ఆగస్టు 28న ‘నేషనల్ హెరాల్డ్' విచారణ | National Herald hearing on August 28 | Sakshi
Sakshi News home page

ఆగస్టు 28న ‘నేషనల్ హెరాల్డ్' విచారణ

Aug 8 2014 3:39 PM | Updated on Mar 29 2019 9:24 PM

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణను ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు విచారణను ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహ పలువురిపై నేషనల్ హెరాల్డ్ దినపత్రికను సొంతం చేసుకున్న అంశానికి సంబంధించి ఆ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, వారిపై జారీ చేసిన సమన్లను ఆగస్ట్ 13 వరకు నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం స్టే విధించడంతో.. ట్రయల్ కోర్టు గురువారం పై నిర్ణయం తీసుకుంది.

 

కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన విరాళాలతో నేషనల్‌ హెరాల్డ్ ఆస్తులు కొనుగోలు చేశారంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సోనియాపై కేసు దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement