డియర్ పోటస్.. హేపీ బర్త్డే! | narendra modi extends birthday wishes to obama | Sakshi
Sakshi News home page

డియర్ పోటస్.. హేపీ బర్త్డే!

Aug 4 2015 6:49 PM | Updated on Aug 15 2018 2:20 PM

డియర్ పోటస్.. హేపీ బర్త్డే! - Sakshi

డియర్ పోటస్.. హేపీ బర్త్డే!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు. ఈ సంవత్సరం మీకు చాలా బాగుండాలని, నూరేళ్లు చల్లగా బతకాలని, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని ఆయన ఆశించారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు దేశాధినేతలకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు పంపడం మోదీకి అలవాటు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత సందర్శించిన దేశాల అధినేతలకు కూడా ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటారు.

 

Advertisement
 
Advertisement
Advertisement