తెలుగు ప్రజలకు మోదీ ట్వీట్స్‌ | Narendra Modi‏ conveys greetings to Telugu People | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు మోదీ ట్వీట్స్‌

Jun 2 2017 1:16 PM | Updated on Sep 5 2017 12:40 PM

తెలుగు ప్రజలకు మోదీ ట్వీట్స్‌

తెలుగు ప్రజలకు మోదీ ట్వీట్స్‌

రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ట్విటర్‌ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో ముందుకు దూసుకుపోవాలని ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను హుషారైన వారిగా పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్‌ కొత్త శిఖరాలకు చేరాలని కోరుకున్నారు. దేశ ప్రగతిలో తన పాత్రను ఏపీ కొనసాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం మోదీ.. రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ రోజు రాత్రి ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఇప్పటికే జర్మనీ, స్పెయిన్‌లో పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement