తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు | Ys Jagan Wishes Happy Dussehra To Telugu People | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు

Oct 1 2025 4:43 PM | Updated on Oct 2 2025 11:09 AM

Ys Jagan Wishes Happy Dussehra To Telugu People

సాక్షి, తాడేపల్లి: దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి అని ఆయన అన్నారు. 

చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

‘‘చెడు ఎంత బలంగా ఉన్నా చివ‌రికి మంచి గెలుస్తుందన్న‌దే విజ‌య‌ద‌శ‌మి పండుగ సారాంశం. అమ్మ‌వారి ఆశీస్సుల‌తో ఈ విజ‌య‌ద‌శ‌మి ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లో ఆనందం, ఐశ్వ‌ర్యం, విజ‌యాలు తీసుకురావాల‌ని ఆకాంక్షిస్తూ అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు. 

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు

 

Advertisement
 
Advertisement
Advertisement