
నాగాలాండ్ సీఎంగా జెలియాంగ్
ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. బుధవారం అసెంబ్లీలో షుర్హోజెలీ లీజిత్సు బల నిరూపణ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉండ గా.
ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ పీబీ ఆచార్య
కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. బుధవారం అసెంబ్లీలో షుర్హోజెలీ లీజిత్సు బల నిరూపణ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉండ గా.. ఆయన హాజరుకాలేదు. దీంతో ప్రభు త్వ ఏర్పాటుకు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) నేత టీఆర్ జెలియాంగ్‌ను గవర్నర్ పీబీ ఆచార్య ఆహ్వానించారు. ఆ వెంటనే జెలియాంగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈనెల 22లోగా బల నిరూ పణ చేసుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం జెలియాంగ్ మాట్లాడుతూ, 21న అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొంటానని తెలిపారు. ఫ్లోర్ టెస్ట్ తర్వాతనే మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. మరో వైపు జెలియాంగ్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిగంటల్లోనే ఆయన్ను పార్టీ నుంచి ఎన్‌పీఎఫ్ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరో పిస్తూ ఆయనను తొలగించింది.
బహిష్కరణపై జెలియాంగ్ స్పందిస్తూ.. పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదని, అసెంబ్లీలో తన సభ్యత్వంపై ప్రభావం ఉండద న్నారు. సభలో ఎన్‌పీఎఫ్ నేతగానే కొన సాగుతా నని చెప్పారు. పురపాలక ఎన్నికల్లో మహిళ లకు 33% రిజర్వేషన్ కల్పించడంపై ఆం దోళనలు చెలరేగడంతో ఫిబ్రవరిలో సీఎం పదవికి జెలియాంగ్ రాజీనామా చేశారు.