'రాహుల్ పశ్చాత్తాప యాత్రలు చేస్తే మంచిది' | Muralidhar rao attends jankalyan parv in guntur | Sakshi
Sakshi News home page

'రాహుల్ పశ్చాత్తాప యాత్రలు చేస్తే మంచిది'

May 27 2015 1:06 PM | Updated on Mar 29 2019 8:33 PM

'రాహుల్ పశ్చాత్తాప యాత్రలు చేస్తే మంచిది' - Sakshi

'రాహుల్ పశ్చాత్తాప యాత్రలు చేస్తే మంచిది'

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ రైతు యాత్రలు కాదు పశ్చాత్తాప యాత్రులు చేస్తే మంచిదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు.

గుంటూరు: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ రైతు యాత్రలు కాదు పశ్చాత్తాప యాత్రులు చేస్తే మంచిదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. మోదీ దేశ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి మంగళవారానికి ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా జన కల్యాణ్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా బుధవారం గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీధరరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ... మోదీ ప్రధాని అయ్యాక దేశం ఆర్థికవృద్ధిలో ముందడుగు వేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు పాదాలపై తమ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి తమ పార్టీ అనేక విషయాల్లో సహకరించిందని మురళీధరరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దక్షిణాదిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎదిగేందుకు పార్టీ అగ్రనేతలు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో గతంలోనే తమ పార్టీ స్పష్టత ఇచ్చిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement