లోక్సభ ఎన్నికల బరిలో పోలీసు కమిషనర్ ! | Mumbai Police Commissioner quits; may contest polls | Sakshi
Sakshi News home page

లోక్సభ ఎన్నికల బరిలో పోలీసు కమిషనర్ !

Jan 31 2014 10:01 AM | Updated on Sep 2 2017 3:13 AM

ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేయనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి మహారాష్ట్ర పోలీసు వర్గాలు.

ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేయనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి మహారాష్ట్ర పోలీసు వర్గాలు. రానున్న లోక్ సభ ఎన్నికలలో ముంబై లేదా ఉత్తరప్రదేశ్ నుంచి బరిలో దిగేందుకు ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నారని ఆ రాష్ట్ర పోలీసు శాఖలో అంతర్గతంగా ప్రచారం జరుగుతుంది.

 

సత్యాపాల్ సింగ్ తన రాజీనామా లేఖను ఇప్పటికే ఆ హోంశాఖకు పంపారని, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆ లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. అక్కడ సత్యపాల్ రాజీనామాను సీఎం కార్యాలయం పచ్చ జెండా ఊపిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా సత్యపాల్ తన రాజకీయ రంగ ప్రవేశంపై మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అయితే సత్యపాల్ను ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్గీలు తమ పార్టీలలో చేరాలని ఇప్పటికే ఆహ్వానించాయి. సత్యపాల్ సింగ్ 1980 బ్యాచ్ ఐపీఎస్ చెందిన అధికారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement