Raj Kundra: ఒక్కరోజు ఆదాయం రూ. 9 లక్షలు!

OTT Porn App Through Which Raj Kundra Earned Lakhs Per Day - Sakshi

Raj Kundra Arrest: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హాట్‌ హిట్‌ యాప్‌ ద్వారా రాజ్‌ కుంద్రా రోజుకు లక్షల్లో ఆర్జించేవాడని.. ఒక్కోసారి గరిష్టంగా రోజుకు 8-9 లక్షల రూపాయల వరకు సంపాదించేవాడని తెలిసింది. ఓ సారి ఏకంగా రాజ్‌ కుంద్రా అకౌంట్‌లోకి 9.65 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు వెల్లడయ్యింది. 

హాట్‌ హిట్‌ యాప్‌ వేదికగా రాజ్‌ కుంద్రా అశ్లీల చిత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ గురించి సర్చ్‌ చేస్తే.. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్‌లో ‘‘బెస్ట్‌ ఇండియన్‌ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ ఈ యాప్‌లో ఉంటాయి. ఈ యాప్‌లో వీడియోలు చూడాలంటే నెలకు 198 రూపాయలు, 45 రోజులకు 249 రూపాయలతో సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్‌ హెచ్‌డీ వీడియోలను చూడొచ్చు’’ అని వెల్లడించారు. 

ఎబౌట్‌ అస్‌లో ‘‘హాట్‌ హిట్‌ అనేది ఒక ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ యాప్‌. ఇక్కడ మీరు వందల కొద్ది అడల్ట్‌ సినిమాలు, హిందీ వెబ్‌సిరీస్‌ ఎంజాయ్‌ చేయవచ్చు. హాట్‌హిట్‌ ఒరిజనల్స్‌ అడల్ట్‌ కంటెంట్‌ని ప్రసారం చేస్తుంది’’ అని డైరెక్ట్‌గా ప్రకటించుకుంది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో అశ్లీల చిత్రాల కోసం నగ్న సన్నివేశాలను చిత్రీకరించాలని ఔత్సాహిక నటీమణులను బలవంతం చేసినందుకు గాను ముంబై పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి విచారణ సందర్భంగా రాజ్‌కుంద్రా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలా చిత్రీకరించిన అశ్లీల చిత్రాలను పెయిడ్‌ వెబ్‌సైట్‌లు, యాప్‌లలో ప్రసారం చేస్తారు. 

రాజ్ కుంద్రా మొబైల్ రికార్డుల పరిశీలనలో హాట్ హిట్ నుంచి క్రమం తప్పకుండా డబ్బులు వస్తున్నట్లు చూపించింది. ఫిబ్రవరిలో ఈ పోర్న్‌ రాకెట్‌ వెలుగు చూడటానికి కొన్ని రోజుల ముందే రాజ్‌ కుంద్రాకు ఫిబ్రవరి 3 న హాట్ హిట్ నుంచి రూ. 2.7 లక్షలు బదిలీ అయినట్లు తెలిసింది. అదేవిధంగా జనవరి 23 న రూ. 95,000, జనవరి 20 న రూ. 1 లక్ష, జనవరి 13 న రూ. 2 లక్షలు, జనవరి 10 న రూ. 3 లక్షలు రాజ్‌ కుంద్రా అకౌంట్‌కు మనీ ట్రాన్ఫ్‌ఫర్‌ జరిగినట్లు వెల్లడయ్యింది.

అంతకుముందు, ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే మాట్లాడుతూ, రాజ్ కుంద్రా, అతని బావ ప్రదీప్ బక్షికి చెందిన రెండు కంపెనీలకు కెన్రిన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన 'హాట్షాట్స్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్' అనే మొబైల్ యాప్ ఉందని తెలిపారు. ఈ హాట్‌షాట్‌ యాప్‌ వివాదానికి కేంద్రంగాఉంది. ఈ యాప్‌ ద్వారా అశ్లీల చిత్రాలను పంపిణీ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపణలున్నాయి.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top