పొర్నోగ్రఫీ కేసులో శిల్పా శెట్టి భర్త అరెస్ట్‌

Actor Shilpa Shetty Husband Raj Kundra Arrested In Porn Films Case - Sakshi

Raj Kundra: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాను ముంబై పోలీసులు పొర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఫిబ్రవరిలో నమోదైన ఒక కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌ కుంద్రాను సోమవారం అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీస్‌ కమిషనర్‌ హేమంత్‌ నగ్రాలె తెలిపారు. కుంద్రాకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. నటీ నటులను బలవంతపెట్టి నగ్న చిత్రాలను చిత్రీకరించి, వాటిని పెయిడ్‌ మొబైల్‌ యాప్స్‌కు అమ్మే ముఠాకు సంబంధించి 9 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top