అమ్మకోసం మెరినా బీచ్ దగ్గర .. | Mourning Amma, People Get Their Heads Tonsured | Sakshi
Sakshi News home page

అమ్మకోసం మెరినా బీచ్ దగ్గర ..

Dec 7 2016 1:14 PM | Updated on Sep 4 2017 10:09 PM

వేలాదిగా తరలి వచ్చిన మహిళలు, పురుషులు అమ్మకు నివాళిగా తలనీలాలు సమర్పిస్తూ ప్రియమైన అమ్మపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

చెన్నై: అమ్మకోసం కన్నీటి సంద్రమైన తమిళనాడులో మరో అరుదైన ఘట్టం నమోదైంది.  జయలలితకు అంత్యక్రియలు  నిర్వహించిన మెరీనా బీచ్  వేలాదిమందితో మరోసారి పోటెత్తింది. దీంతో ఎంజీఆర్,  జయలలితను సమాధుల  ప్రదేశం పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. వేలాదిగా తరలి వచ్చిన మహిళలు,  పురుషులు అమ్మకు నివాళిగా తలనీలాలు సమర్పిస్తూ  ప్రియమైన అమ్మపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

జయలలిత ఆఖరి విశ్రాంత స్థలంవద్ద   అన్నా డీఎంకే కార్యాకర్తలు, ఇతర  అభిమానులు   గౌరవం సూచకంగా తలనీలాలు  సమర్పిస్తూ నివాళులర్పిస్తున్నారు.  అసంఖ్యాకంగా హాజరైన ఆమె అభిమానులు సమాధిని దర్శించుకొని కన్నీరు మున్నీరవుతున్నారు.  దీంతో అన్నాసలై  జనసంద్రమైంది.  దీంతో   పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నియంత్రణ చర్యల్ని చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement