ట్రంప్‌పై.. మార్కో రూబియో సెటైర్‌.. క్లిప్‌ డీలీట్‌ | US Deletes Rubio Video Clip After Remarks On India–US Relations Spark Political Controversy | Sakshi
Sakshi News home page

ట్రంప్‌పై.. మార్కో రూబియో సెటైర్‌.. క్లిప్‌ డీలీట్‌

May 25 2026 10:57 PM | Updated on May 26 2026 1:44 PM

every country has stupid people if it applies to trump

అమెరికా  విదేశాంగ శాంగ మంత్రి మార్కో రూబియో అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార చర్యలపై వివరణ ఇచ్చారు. తాజాగా ఆవీడియో క్లిప్‌ను ఆ దేశ అధికారులు  అధికారిక ఖాతా నుంచి తొలిగించారు. ప్రతి దేశంలోనూ మూర్ఖులుంటారు అన్న పదం పరోక్షంగా ట్రంప్‌కు చురకులంటించే విధంగా ఉండడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.  

నిన్న(ఆదివారం) భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, మార్కో రూబియో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికాలో భారతీయులపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు, అలాగే భారతదేశాన్ని "నరకకూపం"గా పేర్కొంటూ చేసిన  ట్రంప్‌ చేసిన ఒక పోస్ట్‌ అంశమై మీడియా ప్రతినిధులు మార్కో రూబియోను ‍ప్రశ్నించారు.

దీనికి మార్కో రూబియో వివరణ ఇస్తూ.. “ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ తెలివితక్కువ మాటలు మాట్లాడే మూర్ఖులు ఉంటారు. వారి మాటలను మెుత్తం దేశానికి ఆపాదించకూడదన్నారు. ట్రంప్ భారతదేశానికి, ప్రధాని మోదీకి పెద్ద అభిమాని అని అన్నారు." అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆ దేశ అధికారులు వెంటనే తమ అధికారిక ఖాతా నుంచి తొలగించారు.

మార్కో రూబియో చేసినా వ్యాఖ్యలు పరోక్షంగా  అధ్యక్షుడు ట్రంప్‌ను "తెలివితక్కువ మాటలు మాట్లాడే" "మూర్ఖులలో" ఒకరిగా అభివర్ణిస్తున్నట్లు రాజకీయ  విమర్శకులు ప్రస్థావించిన తర్వాత  ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement