కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం షాక్ | MIM stuns Congress, NCP in Aurangabad civic polls | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం షాక్

Apr 23 2015 6:39 PM | Updated on Sep 3 2017 12:45 AM

కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం షాక్

కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం షాక్

మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మజ్లిస్ పార్టీ షాకిచ్చింది.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మజ్లిస్ పార్టీ షాకిచ్చింది. అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదాను సాధించింది. మొత్తం 113 స్థానాలున్న ఔరంగాబాద్ కార్పొరేషన్లో బీజేపీ- శివసేన కూటమి 51 స్థానాలు సాధించి అతిపెద్ద కూటమిగా అవతరించింది. మజ్లిస్ పార్టీ ఒక్కటే 25 స్థానాలు పొందింది.

కాంగ్రెస్ పార్టీ కేవలం 10 చోట్ల మాత్రమే గెలవగా, దాని మిత్రపక్షమైన ఎన్సీపీ మూడు చోట్లే జయకేతనం ఎగరేసింది. మరో 24 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర చిన్న పార్టీల వాళ్లు గెలిచారు. బీజేపీ కూటమి అతిపెద్ద పార్టీగా అవతరించినా, దానికి సాధారణ మెజారిటీ కంటే ఆరు స్థానాలు తగ్గాయి. దాంతో స్వతంత్రులు లేదా ఇతర చిన్న పార్టీల అభ్యర్థుల మద్దతు తప్పనిసరి అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement