సొరంగంలో ఐదు బోగీలు.. బయట మూడు | Metro services disrupted in Kolkata | Sakshi
Sakshi News home page

సొరంగంలో ఐదు బోగీలు.. బయట మూడు

Oct 7 2015 11:22 AM | Updated on Oct 16 2018 5:07 PM

కోల్కతా మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

కోల్కతా: కోల్కతా మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దక్షిణ కోల్ కతాలో కవి సుభాష్ నుంచి బయలు దేరిన నాన్ ఏసీ మెట్రో రైలు బుధవారం ఉదయం 6.45గంటలకు బయలుదేరింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తి కాసేపటికే పార్క్ స్ట్రీట్ స్టేషన్ వద్ద ఉదయం 7.20గంటలకు ఆగిపోయింది.

కాగా, ఈ రైలులోని ఐదు బోగిలు సొరంగ మార్గంలో ఉండిపోగా, మరో మూడు బయటకు ఉన్నాయి. పట్టాల నుంచి మంటలు వస్తున్నట్లుగా గుర్తించి డ్రైవర్ ట్రైన్ను నిలిపేసినట్లు తెలిసింది. ఈఘటన జరిగిన వెంటనే ప్రయాణీకులందరిని రైల్లో నుంచి ఖాళీ చేయించారు. దీంతో కాసేపు ఆ మార్గంలోని రైలు సర్వీసులు రద్దయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement