ఎన్నికల్లో మెర్కెల్ హ్యాట్రిక్ | Merkel hat-trick in elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో మెర్కెల్ హ్యాట్రిక్

Sep 24 2013 5:17 AM | Updated on Sep 1 2017 10:59 PM

జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ) హ్యాట్రిక్ సాధించింది.


 బెర్లిన్: జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ) హ్యాట్రిక్ సాధించింది. గడచిన రెండు దశాబ్దాల ఫలితాల కన్నా అధిక సీట్లు కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. అయినప్పటికీ, అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీకి 4 సీట్లు తగ్గడం గమనార్హం. సోమవారం వెల్లడించిన అధికారిక ఫలితాల్లో సీడీయూ దాని భాగస్వామ్య క్ట్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ)లు 41.7 శాతం ఓట్లతో భారీ విజయం నమోదు చేసుకున్నాయి. యూరో జోన్‌లో ప్రస్తుతం నెలకొన్న పెను ఆర్థిక సంక్షోభం నేపథ్యంలోనూ ప్రజలందరూ 59 ఏళ్ల మెర్కెల్ నాయకత్వానికే మద్దతు పలకడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement