సౌదీ మృతుల్లో పెరిగిన భారతీయుల సంఖ్య | Mecca crane crash: Death toll of Indians goes up to 11 | Sakshi
Sakshi News home page

సౌదీ మృతుల్లో పెరిగిన భారతీయుల సంఖ్య

Sep 14 2015 1:36 AM | Updated on Jul 11 2019 8:48 PM

అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిన దుర్ఘటనలో భారతీయ మృతుల సంఖ్య 11కు పెరిగింది.

జెడ్డా: సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో శుక్రవారం భారీ క్రేన్ కూలిన  దుర్ఘటనలో భారతీయ మృతుల సంఖ్య 11కు పెరిగింది. 115మంది చనిపోయిన ఈ ఘటనలో భారతీయులను గుర్తించే పనిని విదేశాంగ శాఖ చేపట్టింది. మృతులను గుర్తించేందుకు సౌదీ అధికారులు మార్చురీలోకి యాత్రికుల బంధువులను అనుమతించటంతో.. శనివారం గుర్తించిన ఇద్దరితో పాటు మరో 9 మందిని గుర్తించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.

మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ, ఎంపీల నుంచి ముగ్గురు చొప్పున, ఢిల్లీ, బెంగాల్‌ల నుంచి ఇద్దరు చొప్పున, పంజాబ్, బిహార్, అస్సాంల నుంచి ఒక్కొక్కరు గాయపడిన సంగతి తెలిసిందే. భారతీయులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్వరూప్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement