అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం | Mass shooting in US kills 3, injures 12 | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

Oct 16 2016 8:26 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం - Sakshi

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

లాస్ ఏంజెలిస్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. లాస్ ఏంజెలిస్లోని ఓ రెస్టారెంట్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డారు. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వెస్ట్ ఆడమ్స్ జిల్లాలోని ఓ రెస్టారెంట్లో 50 మంది ఉన్నారు. రెస్టారెంట్ నుంచి ముగ్గురు వ్యక్తులు బయటకు వెళ్లి ఆయుధాలతో తిరిగి వచ్చారు. ఈ ముగ్గురూ మరో గ్రూపుపై కాల్పులు జరిపారు. దీంతో వేరే వర్గం వారు కూడా కాల్పులకు దిగారు. ఇరు వర్గాలవారు పరస్పరం కాల్పులు జరపడంతో రెస్టారెంట్ దద్దరిల్లింది. పోలీసులు అక్కడికి వెళ్లే సరికి నిందితులు పరారయ్యారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement