ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
అశ్వారావుపేట(ఖమ్మం): ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వీధిలో ఉండే ఎం.మల్లికార్జునరావు గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు.
ఆవరణలో తన వాహనాన్ని పార్క్ చేసి ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముగ్గురు ఆగంతకులు ఆయనపై కర్రలు, రాడ్‌లతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దానిని గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయటంతో దుండగులు పరారయ్యారు. కాగా, ఈ దాడి దొంగల పనే అయి ఉంటుందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.