ఆర్టీసీ ఆస్తులు కాజేయడానికి కుట్ర

Congress Leaders Alleged That Government Has Planned To Conspiracy Of RTC Assets - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ పూరిత ఆలోచనతో ఆర్టీసీని నిర్వీర్యం చేసి, దాని ఆస్తులు కాజేయడానికి కుట్రపన్నుతోందని పీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్‌ ఆరోపించారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు ఎంత జీతాలు పొందుతున్నారో కూడా తెలియని సీఎం ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రతీ రోజూ కోటి మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్న ఉద్యోగులను తొలగిస్తామనడం దుర్మార్గపు చర్య అన్నారు.

ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే వారి బలిదానాలకు ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం చెల్లించే బకాయిలు చెల్లిస్తే ఆర్టీసీకి నష్టాలే లేవని అన్నారు.  రూ.1052 కోట్లు వాహనాల టాక్స్‌ కింద వసూలు చేసి ఆర్టీíసీకి ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  ఈ విలేకరుల సమావేశంలో నాయకులు దిండిగాల మధు, తాజ్, బొబ్బిలి విక్టర్, నవాబ్, గణపతి, రమేశ్, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top