విమాన ఆచూకీ కోసం స్పీడ్ పెంచిన మలేసియా | Malaysia speeds up search for missing MH370 flight | Sakshi
Sakshi News home page

విమాన ఆచూకీ కోసం స్పీడ్ పెంచిన మలేసియా

Feb 12 2015 7:14 PM | Updated on Sep 2 2017 9:12 PM

విమాన ఆచూకీ కోసం స్పీడ్ పెంచిన మలేసియా

విమాన ఆచూకీ కోసం స్పీడ్ పెంచిన మలేసియా

గతేడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

కౌలాలంపూర్: గతేడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అందుకోసం నాలుగు నౌకలు రంగంలోకి దింపినట్లు మలేసియా రవాణా శాఖ మంత్రి లియోవ్ టియాంగో లాయి గురువారం వెల్లడించారు. విమానం ఆదృశ్యమైన ప్రాంతం... దక్షిణ బంగాళఖాతంలో నౌకలు అణువణువు శోధన చేస్తున్నాయని తెలిపారు. ఓ నౌక మంగళవారమే గల్లంతైన విమానాన్ని శోధించేందుకు రంగంలోకి దిగిందని పేర్కొన్నారు. అయితే ఎమ్హెచ్ 370 అదృశ్యమై దాదాపు ఏడాది కావస్తున్న ఇప్పటి వరకు ఆచూకీ కనుగొనక పోవడంపై సదరు విమాన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

మలేసియా ప్రభుత్వంపై ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. ఎమ్హెచ్ 370 విమానం కోసం ప్రార్థన చేస్తున్నాం అనే అక్షరాలు గల ఏరుపు రంగు టీ షర్ట్ ధరించి.. తెల్లని టోపి పెట్టుకుని గల్లంతైన వారి బంధువులు 15 మంది మంగళవారం పౌర విమానయాన శాఖ కార్యాలయం ఎదుట నిలబడ్డారు. ఈ ప్రమాదం నిన్న వారికి జరిగింది. నేడు, రేపో మీలో మాలో ఎవరో ఒకరికి ఇదే సంఘటన ఎదురు కావచ్చు' అంటూ రాసిన ప్లకార్డులు వారు చేతిలో పట్టుకున్నారు.


239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది.  బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. ఎమ్హెచ్ 370 ప్రమాదానికి గురైందని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అధికారికంగా ప్రకటించడంతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ విమానంలో 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement