ఆధారాలను పరిశీలిస్తున్నాం: పాక్ | Looking at the evidence: Pakistan | Sakshi
Sakshi News home page

ఆధారాలను పరిశీలిస్తున్నాం: పాక్

Jan 5 2016 2:01 AM | Updated on Sep 3 2017 3:05 PM

పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై భారత్ అందించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పాక్ కార్యాలయం తెలిపింది.

ఇస్లామాబాద్: పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై భారత్ అందించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు పాక్  కార్యాలయం  తెలిపింది. దాడి ట్‌పై దాడి దురదృష్టకరమని.. జవాన్లు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని పేర్కొంటూ భారత ప్రభుత్వానికి, ప్రజలకు పాక్ తీవ్ర సంతాపం తెలిపింది. అలాగే.. సుస్థిర చర్చల ప్రక్రియలకు భారత్, పాక్‌లు కట్టుబడి ఉండాలని ఆకాంక్షించింది. మరోవైపు.. పఠాన్‌కోట్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల ఫోన్ కాల్ రికార్డుల వివరాలు, పాక్‌లోని వారి సూత్రధారుల మొబైల్ నంబర్లు, వారు సరిహద్దుకు ఆవలి నుంచి వచ్చినట్లు ఆధారాలను.. మున్ముందు ఇరు దేశాల అధికారులు భేటీ అయినపుడు పాక్‌కు తప్పనిసరిగా అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement