నిద్రస్తున్న బాలికను ఎత్తుకెళ్లిన చిరుత! | Leopard drags off sleeping kid from terrace in Udaipur | Sakshi
Sakshi News home page

నిద్రస్తున్న బాలికను ఎత్తుకెళ్లిన చిరుత!

Jun 24 2016 6:00 PM | Updated on Sep 4 2017 3:18 AM

ఇంటిపైన తల్లిదండ్రులతో కలిసి నిద్రపోతున్న 12 ఏళ్ల బాలికను ఓ చిరుతపులి ఎత్తుకు పోవడంతో రాజస్థాన్ లోని చీతర్ కా బాదల్ గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఉదయ్ పూర్: ఇంటిపైన తల్లిదండ్రులతో కలిసి నిద్రపోతున్న 12 ఏళ్ల బాలికను ఓ చిరుతపులి ఎత్తుకు పోవడంతో రాజస్థాన్ లోని చీతర్ కా బాదల్ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి తమతో పాటు కలిసి నిద్రపోయిన రవీనా తెల్లవారేసరికి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఇంటి వెనుక భాగంలో బాలిక శరీర భాగాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రవీనా శరీరంపై చిరుత గోళ్లు, పంటి గాట్లు కనిపించాయి.

కాగా, ఇళ్లలో నిద్రపోతున్న వారిని చిరుత ఎత్తుకుపోవడం ఈ నెలలో ఇది రెండోసారి. దీంతో కోపోద్రేకులైన గ్రామస్థులు ... అటవీ శాఖ అధికారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిరుత సంచరిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న  పోలీసులు బాలిక శరీరాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గ్రామంలోకి తరచుగా చిరుతలు వస్తున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోయారు. కాగా, పోలీసులు, అటవీ శాఖ అధికారులు చిరుత కోసం వెతుకులాటను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement