ఆప్ లో చేరిన మిల్కాసింగ్ భార్య, కూతురు | Legendary athlete Milkha Singh's wife Nirmal Kaur and their US-based daughter | Sakshi
Sakshi News home page

ఆప్ లో చేరిన మిల్కాసింగ్ భార్య, కూతురు

Jan 11 2014 5:18 PM | Updated on Apr 4 2018 7:42 PM

భారత అథ్లెట్ దిగ్గజం మిల్కాసింగ్ భార్య నిర్మలా కౌర్ మరియు కూతురు మోనా సింగ్ లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు

చంఢీగఢ్ : భారత అథ్లెట్ దిగ్గజం మిల్కాసింగ్ భార్య నిర్మలా కౌర్ మరియు కూతురు మోనా సింగ్ లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ మేరకు వారు పార్టీలో చేరేందుకు అవసరమైన సన్నాహకాలను పూర్తి చేశారు. కాగా మిల్కాసింగ్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన.  అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు, లక్ష్యాలు నచ్చడంతో వారు పార్టీలో చేరారన్నారు. వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తెలిపారు. తాను మాత్రం ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదన్నారు. 

 

భారత్ కు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్న సమయంలో పార్టీలో చేరాలనుకున్నా, అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదన్నాడు. తన భార్య, కూతుర్ని రాజకీయాల్లో రాకుండా అడ్డుకోలేనని,  సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిపక్వత వారికి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత్ తరుపున మిల్కాసింగ్ మూడు సార్లు ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.1958 నుంచి 1962 మధ్య జరిగిన ఆసియా గేమ్స్ లో నాలుగు బంగారు పతకాలు సాధించి భారత్ కీర్తిని ప్రపంచానికి తెలియజేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement