'అందుకే స్మృతి హెచ్ఆర్డీ శాఖను కోల్పోయారు' | Lalu Prasad has kind words for Smriti Irani, calls her Innocent | Sakshi
Sakshi News home page

'అందుకే స్మృతి హెచ్ఆర్డీ శాఖను కోల్పోయారు'

Jul 9 2016 9:28 AM | Updated on Sep 4 2017 4:29 AM

'అందుకే స్మృతి హెచ్ఆర్డీ శాఖను కోల్పోయారు'

'అందుకే స్మృతి హెచ్ఆర్డీ శాఖను కోల్పోయారు'

కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అమాయకురాలని ఆర్డేజీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కితాబిచ్చారు.

పాట్నా: కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అమాయకురాలని ఆర్డేజీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కితాబిచ్చారు. మానవ వనరుల శాఖ మంత్రిగా వీలైనన్ని మంచి పనులు చేశారని ఆయన ప్రశంసించారు. అయితే... ఇతర కార్యక్రమాల్లో స్మృతి ఎక్కువ బిజీ కావటం వల్లే హెచ్ఆర్డీ శాఖను కోల్పోవాల్సి వచ్చిందన్నారు.

చేనేత శాఖలో ఆమె అంతగా రాణిస్తుందనుకోవటం లేదని లాలూ వ్యాఖ్యానించారు. కాగా కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా స్మృతి శాఖను మార్చిన విషయం తెలిసిందే.  మరోవైపు తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తే ప్రధాన పాత్ర పోషిస్తానని ఆయన అన్నారు. లాలూ గతంలో సునీల్ శెట్టి హీరోగా నటించిన 'పద్మశ్రీ లాలూప్రసాద్ యాదవ్' చిత్రంలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement