కొటక్ మహీంద్రా భారీ ఫండ్‌ రైజింగ్‌ | Sakshi
Sakshi News home page

కొటక్ మహీంద్రా భారీ ఫండ్‌ రైజింగ్‌

Published Thu, Mar 30 2017 1:28 PM

Kotak Mahindra Bank rises 1.5% on fundraising plans of Rs 5,500 crore

ముంబై: దేశీయ ప్రయివేటు రంగ బ్యాంకు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌  క్యాపిటల్ ఫండ్‌ రైజింగ్‌   ప్రణాళికలను ప్రకటించింది.  సుమారు రూ.5500 కోట్ల క్యాపిటల్‌ నిధులను సమకూర్చుకోన్నట్టు  బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.  తద్వారా బ్యాంక్‌ను,  అనుబంధ సంస్థల మరింత పటిష్ట పర్చుకోనున్నట్టు తెలిపింది.  6.2 కోట్ల ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సుమారు రూ.5,500 కోట్లను ఆర్జించనుంది.  గరిష్టంగా 3.4 శాతం ఈక్విటీ  డైల్యూషన్‌ ద్వారా ఈ నిధులను సేకరించనుంది. ఈ మేరకు బ్యాంక్‌  బోర్డ్‌ మీటింగ్‌ ఒకే చెప్పింది దీంతో ప్రమోటర్‌ ఉదయ్‌ వాటా 32.1 శాతం నుంచి 31.2 శాతానికి తగ్గనుంది.  దీంతో  గురువారం ఇంట్రాడే లో ఈ బ్యాంక్‌ షేరు లాభాలతో దూసుకుపోయింది. 1.5శాతానికి పైగా లాభపడింది.

అయితే ఇటీవల  విలేకరుల సమావేశంలో  యాక్సిస్‌ బ్యాంక్‌/ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ను కొనుగోలు చేయనున్నట్లు వస్తోన్న వూహాగానాలకు బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఉదయ్‌ కోటక్‌  చెక్‌ పెట్టారు. ఆ వార్తలన్నీ కల్పితాలేనని కొట్టిపారేశారు. ఇతర సంస్థల కొనుగోళ్లు/ విలీనాల ద్వారా కాకుండా ఖాతాదారుల సంఖ్యను సొంతంగానే (ఆర్గానిక్‌) పెంచుకుంటామని ప్రకటించారు.  బ్యాంకు వృద్ధి ప్రణాళికలను, వ్యూహాలను వివరించేందుకు మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

కాగా మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ను కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌  కొనుగోలు చేయనున్నట్టు వార్తలు  మార్కెట్‌ లో హల్‌ చల్‌ చేశాయి. అయితే ఈ వార్తలను యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిఖా  శర‍్మ  కూడా తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.  

 

Advertisement
Advertisement