కోటక్ మహీంద్రా దసరా కానుక | Kotak Mahindra Bank cuts base rase by 10bps | Sakshi
Sakshi News home page

కోటక్ మహీంద్రా దసరా కానుక

Oct 7 2016 12:10 PM | Updated on Sep 4 2017 4:32 PM

కోటక్ మహీంద్రా దసరా కానుక

కోటక్ మహీంద్రా దసరా కానుక

ప్రయివేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా ఖాతాదారులకు పండుక కానుక ప్రకటించింది. తన వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంక్  కోటక్ మహీంద్రా  ఖాతాదారులకు   పండుక కానుక ప్రకటించింది.  ఆర్బీఐ సూచనలతో వడ్డీరేట్లలొ కోత పెడుతున్న బ్యాంకుల  ఖాతాలో ఇపుడు ఈ  బ్యాంకు కూడా చేరిపోయింది.  తన వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.  ఏడాదికి10 బేసిస్ పాయింట్ల  కోతతో  9.40 శాతం బేస్ రేటును ప్రకటించింది.  ఖాతాదారులకు ఇచ్చే అని రకాల రుణాలపై ( ఆర్బీఐ  అనుమతించిన మినహాయింపులు కాక ఇతర ) ఈ  సవరించిన తగ్గింపురేట్లను అమలు చేయనున్నట్టు వివరించింది.
కాగా   ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ  తొలి తాజా ద్రవ్య విధాన సమీక్ష లో రెపో రేటును 25  బేసిస్ పాయింట్లను తగ్గించింది. అలాగే దీనికనుగుణంగా దేశంలోని  బ్యాంకులు కూడా తమ ఖాతాదారాలకు  తగ్గింపు వడ్డీరేట్లను  వర్తింపచేయాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సూచించారు. ఈ నేపథ్యంలోనే  ముందుగా స్పందించిన  ప్రయివేట్ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను  తగ్గించిన సంగతి  తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement