బ్రేకప్‌ను నేను ఎలా ఎదుర్కొన్నానంటే? | Katrina Kaif on how she handled breakup with Ranbir Kapoor: Go to the gym and do crunches | Sakshi
Sakshi News home page

బ్రేకప్‌ను నేను ఎలా ఎదుర్కొన్నానంటే?

Published Wed, Aug 3 2016 3:06 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

బ్రేకప్‌ను నేను ఎలా ఎదుర్కొన్నానంటే?

బ్రేకప్‌ను నేను ఎలా ఎదుర్కొన్నానంటే?

'నా కళ్లకు నువ్వే అలవాటు.. నువ్వు కనిపించకుంటే అవి వెతుక్కుంటాయి'

'నా కళ్లకు నువ్వే అలవాటు.. నువ్వు కనిపించకుంటే అవి వెతుక్కుంటాయి' (ఆంఖోంకో తేరి ఆదాత్ హై.. తునా దిఖే తో షికాయత్ హై).. తాజా సినిమా 'బార్‌ బార్ దేఖో'లోని ఈ పాట కత్రిన ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. గత ఏడాది వరకు ఆమె ఓ నటుడితో సన్నిహితంగా తిరిగింది. ప్రేమలో మునిగితేలింది. ఇద్దరూ ఒకే ప్లాటులో ఉండి సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ అకస్మాత్తుగా వారిద్దరూ వేరయ్యారు. ఒకరికొకరు ఎదురుపడలేనంత దూరమయ్యారు.

బాలీవుడ్‌ ప్రేమపక్షులు పేరొందిన కత్రినాకైఫ్‌-రణ్‌బీర్‌ కపూర్‌ గత ఏడాది చివర్లో బ్రేకప్‌ జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి, రణబీర్‌తో వేరయిన తర్వాత కత్రిన ఎలా గడిపింది? ఈ బ్రేకప్‌ అనంతర పరిణామాలను ఎలా ఎదుర్కొంది? ఆ డిప్రెషన్‌ నుంచి ఎలా కోలుకుంది? తదితర విషయాలపై కత్రిన స్పందించింది. 'నేను తరచూగా జిమ్‌కు వెళ్లి వ్యాయమాలను చేశాను. తద్వారా దానిని (బ్రేకప్‌ను) ఎదుర్కొన్నారు' అని ఆమె ఓ మీడియా సంస్థకు తెలిపింది.

బ్రేకప్‌ అనంతరం కత్రిన చేసిన ఈ కసరత్తు ఊరికే పోలేదు. తన తాజా సినిమా "బార్‌ బార్‌ దేఖో'లో మరింతగా బ్యూటీఫుల్‌గా దర్శనమిచ్చింది ఈ సుందరి. తనకంటే వయస్సులో చిన్నవాడైన సిద్ధార్థ్ కపూర్‌తో జత కట్టిన ఈ అమ్మడు.. అతనికి ఈడు-జోడుగా అలరించింది. హాట్‌ హాట్ అందాలతో ప్రేక్షకుల కనులవిందు చేసింది. ఇప్పటికే సిద్ధార్థ్-కత్రిన జోడీ కలిసి ఆడిపాడిన 'కాలాచష్' పాట ఆన్‌లైన్‌లో దుమ్మురేపుతుండగా.. తాజాగా బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ కూడా హల్‌చల్‌ చేస్తోంది. వయస్సు పెరుగుతున్నా హీరోయిన్‌గా తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా ట్రైలర్‌తో కత్రిన మరోసారి చాటింది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement