25 ఫ్లాపులొచ్చినా సూపర్‌ స్టారే! | Kareena says Ranbir Is a Superstar Despite Flop Films | Sakshi
Sakshi News home page

25 ఫ్లాపులొచ్చినా సూపర్‌ స్టారే!

Sep 20 2016 8:43 PM | Updated on Apr 3 2019 6:23 PM

25 ఫ్లాపులొచ్చినా సూపర్‌ స్టారే! - Sakshi

25 ఫ్లాపులొచ్చినా సూపర్‌ స్టారే!

తన సోదరుడు, బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ అభినయ ప్రతిభపై నటి కరీనా కపూర్‌ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

తన సోదరుడు, బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ అభినయ ప్రతిభపై నటి కరీనాకపూర్‌ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఎన్ని ఫ్లాపులొచ్చినా తన సోదరుడు ఎప్పటికీ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌గానే ఉంటాడని ఆమె తెలిపింది.

’హిందీ చిత్ర పరిశ్రమలో రణ్‌బీర్‌ కపూర్‌ సూపర్‌స్టార్‌. ఏదీ అతని స్టార్‌డమ్‌ను తగ్గించలేదు. 25 ఫ్లాపులిచ్చినా అతను ఉత్తమ నటుడిగానే ఉంటాడు. ’యే దిల్‌ హై ముష్కిల్‌’ సినిమాతో మళ్లీ అతను ట్రాక్‌లోకి వస్తాడని చెప్పడం నాకు నచ్చదు. అతను ఇప్పటికీ సూపర్‌ స్టారే’ అని కరీన ’పీటీఐ’ వార్తాసంస్థతో పేర్కొంది.

’ఈరోజుల్లో హిట్‌లు, ఫ్లాపులు రావడం సాధారణ విషయం. నేను కూడా ఎన్నో ఫ్లాపులు ఎదుర్కొన్నా. సినిమా పరాజయాలు స్టార్‌డమ్‌లను తగ్గిస్తాయని నేను అనుకోవడం లేదు. ఇప్పటికీ మనకున్న నటుల్లో రణ్‌బీర్‌ మంచి నటుడు’ అని ఆమె పేర్కొంది. రాకెట్‌ సింగ్‌, బర్ఫీ, రాక్‌ స్టార్‌ సినిమాలతో బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఇమేజ్‌ పొందిన రణ్‌బీర్‌ను బేషరమ్, బొంబే వెల్వెట్‌ సినిమాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. సరైన హిట్‌ లేక స్టార్‌డమ్‌ కోల్పోతున్న తన సోదరుడికి ’యే దిల్‌ హై ముష్కిల్‌’ సినిమా భారీ విజయాన్ని అందిస్తుందని కరీన ధీమా వ్యక్తం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement