బైకుపై హీరోయిన్‌ సాహసయాత్ర! | Kalki Koechlin 4,000 km biking trip for tv show | Sakshi
Sakshi News home page

బైకుపై హీరోయిన్‌ సాహసయాత్ర!

Sep 3 2016 12:04 PM | Updated on Aug 30 2018 4:49 PM

బైకుపై హీరోయిన్‌ సాహసయాత్ర! - Sakshi

బైకుపై హీరోయిన్‌ సాహసయాత్ర!

జీవితమంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు.. గమ్యం కోసం చేసే ప్రయాణమని చెప్తారు.

జీవితమంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు.. గమ్యం కోసం చేసే ప్రయాణమని చెప్తారు. దేశాంతర సంచారాలు చేసే ప్రయాణికులు, సాహసికులకు అది నిజమే అనిపిస్తోంది. ప్రయాణం ఎన్నో మధురానుభూతుల్ని మిగిలిస్తుంది. ప్రయాణం జీవితాన్ని కొత్తగా అందంగా చూపిస్తుంది. సరికొత్త ఊపిరినింపుతుంది.

అందుకే ప్రయాణాలు చేసి కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అదే కోవలో బాలీవుడ్‌ నటి కల్కీ కొచ్లిన్‌ సాహసయాత్రకు పూనుకుంది. ఫొటోగ్రాఫర్‌, బైకర్‌ అయిన తన తండ్రి జోయెల్‌ కొచ్లిన్‌తో కలిసి ఆమె బైకులపై సాహసయాత్రకు బయలుదేరింది. ఒక్కటి కాదు రెండు ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల బైకుయాత్ర.. అందమైన ఈశాన్య భారతం మీదుగా, అసోం, మేఘాలయా, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అందమైన ప్రాంతాలను అన్వేషిస్తూ ఆమె ముందుకుసాగింది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులపై తండ్రి, కూతుళ్లు కలిసి చేసిన ఈ సుదీర్ఘ యాత్ర త్వరలో ’ఫాక్స్‌ లైఫ్‌’  కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం కానుంది. సాధారణంగా సెలబ్రిటీ ప్రయాణాలు అనగానే విలాసవంతంగా, సుఖవంతంగా ఉంటాయి. అందుకుభిన్నంగా వాస్తవికతతో, విభిన్నమైన దృష్టితో సాగే ఈ బైకు యాత్ర ఈ నెల 17 నుంచి ’కల్కీస్‌ గ్రేట్‌ ఎస్కేప్‌’ షో పేరిట ప్రసారం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement