అమెరికన్ వర్సిటీపై ఉగ్రదాడి | Kabul:Terrorists Attacks American University Of Afghanistan | Sakshi
Sakshi News home page

అమెరికన్ వర్సిటీపై ఉగ్రదాడి

Aug 24 2016 9:25 PM | Updated on Apr 4 2019 3:48 PM

అమెరికన్ వర్సిటీపై ఉగ్రదాడి - Sakshi

అమెరికన్ వర్సిటీపై ఉగ్రదాడి

కాబుల్ నగరంలోని ప్రఖ్యాత అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ అఫ్ఘనిస్థాన్ పై బుధవారం రాత్రి ఉగ్రదాడి జరిగింది.

కాబుల్: అఫ్ఘనిస్థాన్ రాజధాని నగరంలో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. బుధవారం రాత్రి కాబుల్ నగరంలోని ప్రఖ్యాత అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ అఫ్ఘనిస్థాన్ లోకి చొరబడ్డ ముష్కరులు బాంబులు పేల్చుతూ, తూలాల వర్షం కురిపించారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పలువురు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది విద్యార్థులు వర్సిటీ లోపలే చిక్కుకు పోయారు. ప్రభుత్వ దళాలు ఘటనాస్థలానికి చేరుకుని ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్ ప్రారంభించారు. 'భారీ పేలుళ్లు, తుపాకి చప్పుళ్లు వినిపిస్తున్నాయి.. భయంగా ఉంది' అంటూ లోపలున్నవారు మెసేజ్ ల ద్వారా స్నేహితులకు సమాచారం అందించారు. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  


Advertisement
 
Advertisement
Advertisement