చిక్కుల్లో జయలలిత! | Jayalalithaa in trouble! | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో జయలలిత!

Jun 17 2014 7:41 PM | Updated on Sep 27 2018 8:37 PM

జయలలిత - Sakshi

జయలలిత

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.

 న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 66 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన ఈ కేసు విచారణపై విధించిన స్టేను కోర్టు మంగళవారం ఎత్తివేసింది. అలాగే ఆమెకు చెందిన ఆదాయానికి మించిన ఆస్తుల్లో తమ ఆస్తులను చేర్చి జప్తు చేశారని చెన్నైకి చెందిన లెక్స్ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కంపెనీ వేసిన పిటిషన్‌ను దిగువ కోర్టు పరిష్కరించేదాకా విచారణపై స్టే విధించాలన్న జయ పిటిషన్‌ను కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. లెక్స్ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కంపెనీ  వాటాలతో తనకు సంబంధంలేదని జయలలిత వాదన.

జయపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై ఆమె హయాంలో చెన్నైలో పారదర్శక విచారణ  సాధ్యం కాదని ఓ పిటిషన్ దాఖలు కావడంతో సుప్రీం కోర్టు ఆదేశంపై కేసును 2003లో బెంగళూరు కోర్టుకు బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement