'కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు' | Jana reddy takes on Kcr | Sakshi
Sakshi News home page

'కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు'

Jul 29 2015 1:45 PM | Updated on Aug 15 2018 9:27 PM

'కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు' - Sakshi

'కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు'

ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చాడని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు.

నల్గొండ : ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చాడని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు. బుధవారం నల్గొండ జిల్లా అనుములలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ఎన్నికల నాటి హామీలు అమలు పర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్పై ధ్వజమెత్తారు.

కేసీఆర్ గ్రామపంచాయితీ సమస్యలు పరిష్కరించడంలో కూడా విఫలమయ్యారని జానారెడ్డి విమర్శించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ప్రజలే తమ ఇళ్లలో, వీధుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకొని  తద్వారా ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేయాలని జానారెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement