breaking news
T CLP Leader
-
'కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు'
నల్గొండ : ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చాడని కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కుందూరు జానారెడ్డి ఆరోపించారు. బుధవారం నల్గొండ జిల్లా అనుములలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ఎన్నికల నాటి హామీలు అమలు పర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్పై ధ్వజమెత్తారు. కేసీఆర్ గ్రామపంచాయితీ సమస్యలు పరిష్కరించడంలో కూడా విఫలమయ్యారని జానారెడ్డి విమర్శించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ప్రజలే తమ ఇళ్లలో, వీధుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకొని తద్వారా ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేయాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. -
’సెక్షన్ - 8 ఎప్పుడు ఎలా అమలు చేయాలి?’
-
'ఆ పదాన్ని' వాడటం సరికాదు
హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క హుందాగా వ్యవహరించాలంటూ తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలతో జానారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసి అని అంటే పరుష పదజాలం వాడితే తప్పుపడుతున్న మన పార్టీ నేతలు... అలాంటి పదాన్ని మనం వాడటం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ వారంతా హుందాగా వ్యవహారించాలని ఈ సందర్భంగా జానారెడ్డి సూచించారు. సెక్షన్ - 8 ఎప్పుడు ఎలా అమలు చేయాలనేదానిపై స్పష్టత ఇవ్వాలి ఈ సందర్భంగా కేంద్రం, గవర్నర్ను డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎవరికి వారు అభిప్రాయాలు చెబుతూ గందరగోళ పరచడం సరికాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నత్తనడకన సాగుతుందో లేదో ప్రభుత్వమే పరిశీలించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై స్పీకర్, కేసులు నడుస్తున్నాయి... ఆ ఆంశంపై పదేపదే మాట్లాడలేనని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు పలు వ్యాఖ్యలు చేసిన సందర్భంగా జానారెడ్డి....శుక్రవారం కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు.