'ఆ పదాన్ని' వాడటం సరికాదు | K.Jana reddy meeting with T congress leaders in hyderabad | Sakshi
Sakshi News home page

'ఆ పదాన్ని' వాడటం సరికాదు

Jun 19 2015 12:22 PM | Updated on Sep 3 2017 4:01 AM

'ఆ పదాన్ని' వాడటం సరికాదు

'ఆ పదాన్ని' వాడటం సరికాదు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క హుందాగా వ్యవహరించాలంటూ తెలంగాణ శాసన సభలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి సూచించారు.

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క హుందాగా వ్యవహరించాలంటూ తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలతో జానారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసి అని అంటే పరుష పదజాలం వాడితే తప్పుపడుతున్న మన పార్టీ నేతలు... అలాంటి పదాన్ని మనం వాడటం సరికాదని హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీ వారంతా హుందాగా వ్యవహారించాలని ఈ సందర్భంగా జానారెడ్డి సూచించారు. సెక్షన్ - 8 ఎప్పుడు ఎలా అమలు చేయాలనేదానిపై స్పష్టత ఇవ్వాలి ఈ సందర్భంగా కేంద్రం, గవర్నర్ను డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎవరికి వారు అభిప్రాయాలు చెబుతూ గందరగోళ పరచడం సరికాదని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నత్తనడకన సాగుతుందో లేదో ప్రభుత్వమే పరిశీలించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై స్పీకర్, కేసులు నడుస్తున్నాయి... ఆ ఆంశంపై పదేపదే మాట్లాడలేనని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు పలు వ్యాఖ్యలు చేసిన సందర్భంగా జానారెడ్డి....శుక్రవారం కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement