కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డ ఉగ్రవాదులు | J-K: Five paramilitary troopers injured in militant attack in Kulgam | Sakshi
Sakshi News home page

కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డ ఉగ్రవాదులు

Published Mon, Sep 26 2016 4:09 PM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డ ఉగ్రవాదులు - Sakshi

కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డ ఉగ్రవాదులు

ఉడి దాడి ఘటనతో 18మంది జవాన్లను బలిగొన్న ఉగ్రవాదులు సోమవారం దక్షిణ కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డారు. సెక్యురిటీ ఫోర్స్పై దాడిచేశారు.

ఉడి దాడి ఘటనతో 18మంది జవాన్లను బలిగొన్న ఉగ్రవాదులు సోమవారం దక్షిణ కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డారు. సెంట్రల్ సెక్యురిటీ  ఫోర్స్పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయాల పాలయ్యారు. దక్షిణ శ్రీనగర్లోని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్గామ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రారంభించే రోడ్డు ఓపెనింగ్ పార్టీలో అనుమానిత మిలిటెంట్లు గ్రనేడ్తో దాడికి పాల్పడారని పోలీసులు పేర్కొన్నారు.
 
ఈ గ్రెనేడ్ టార్గెట్ కోల్పోయి, రోడ్డు పక్కకు పేలిందని చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆరీపీఎఫ్ జవాన్లు గాయాలు పాలయ్యారని, వారిని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వివరించారు. కశ్మీర్లో నెలకొన్న అల్లర్లకు కుల్గామ్ ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఎనౌకౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లతో మరణించిన 90మందిలో ఎక్కువగా కుల్గామ్ ప్రాంతానికి చెందిన వారే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement