మద్యపాన నిషేధం అసాధ్యం | It is impossible to ban alcohol : MP Kavitha | Sakshi
Sakshi News home page

మద్యపాన నిషేధం అసాధ్యం

Aug 20 2015 1:35 AM | Updated on Aug 9 2018 4:51 PM

మద్యపాన నిషేధం అసాధ్యం - Sakshi

మద్యపాన నిషేధం అసాధ్యం

మద్యపానాన్ని నిషేధించడం ప్రభుత్వాల బాధ్యత అయినప్పటికీ... దీనిని పూర్తిగా రూపుమాపడం సాధ్యం కావడం లేదని...

నిజామాబాద్ ఎంపీ కవిత
సారంగాపూర్: మద్యపానాన్ని నిషేధించడం ప్రభుత్వాల బాధ్యత అయినప్పటికీ... దీనిని పూర్తిగా రూపుమాపడం సాధ్యం కావడం లేదని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. మన ఊరు-మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో కేరళ రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించినా సంపూర్ణంగా అమలు కాలేదని గుర్తుచేశారు. మద్యపాన నిషేధం సాధ్యం కాదని, దీనిని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని ప్రవేశపెట్టనుందని తెలిపారు.

చీప్‌లిక్కర్ ద్వారా గుడుంబా నియంత్రణ సాధ్యం కాకపోతే ప్రతిపక్షాలు చేసే విమర్శలతో తాను ఏకీభవిస్తానని కవిత పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement