ఇక 'చికెన్ బాంబులు' ! | Is 'chicken bomb' next in Islamic State's weaponry? | Sakshi
Sakshi News home page

ఇక 'చికెన్ బాంబులు' !

Jul 21 2015 4:57 PM | Updated on Sep 3 2017 5:54 AM

ఇక 'చికెన్ బాంబులు' !

ఇక 'చికెన్ బాంబులు' !

ఇస్లామిక్ తీవ్రవాదులు ప్రత్యర్థులపై దాడికి సరికొత్త వ్యూహా రచనకు శ్రీకారం చుట్టారని సమాచారం.

లండన్: ఇస్లామిక్ తీవ్రవాదులు ప్రత్యర్థులపై దాడికి సరికొత్త వ్యూహా రచనకు శ్రీకారం చుట్టారని సమాచారం. అందులోభాగంగా  కోళ్లను ఆయుధాలుగా మలచుకుని ప్రత్యర్థుల ఉసురు తీసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకోసం 'చికెన్ బాంబు'లను తెరపైకి తీసుకు వచ్చింది. ప్రత్యర్థుల వద్దకు బాంబులు అమర్చిన కోళ్లను పంపి రిమోట్ సహాయంతో వాటిని పేల్చివేయాలని ఐఎస్ తీవ్రవాదులు పథక రచనలో ఉన్నారని మీడియా మంగళవారం వెల్లడించింది.

అందుకోసం కోళ్లకు బాంబులు అమర్చిన ఫొటోలు ఇప్పటికే సోషల్ నెట్వర్కింగ్ సైట్ల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే సొంతంగా బాంబులు తయారు చేసుకుంటున్న ఐఎస్ తీవ్రవాదులు ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారని మీడియా పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement