డ్యూయల్‌ సిమ్‌ ఆపిల్‌ రానుందా?

డ్యూయల్‌ సిమ్‌ ఆపిల్‌ రానుందా? - Sakshi

ఆపిల్‌ ఈ బ్రాండ్‌ ఫోన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా వెర్రెత్తిపోయే వారేందరో. మొన్నటికి మొన్న ఆపిల్‌ ఫోన్‌ కోసం కిడ్నీలు అమ్ముకున్న వార్తలూ చూశాం. తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం ఆపిల్‌ డ్యూయల్‌ సిమ్‌ ఫోన్లను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తోందట. ఈ మేరకు డ్యూయల్‌ సిమ్‌కు సంబంధించిన పేటెంట్‌ హక్కులను ఆపిల్‌ ఈ మధ్యే పొందిందని సమాచారం. ఇదే నిజమైతే ఆపిల్‌ ఫోన్‌ అంటే చెవి కోసుకునే వారికి బంపర్‌ ఆఫరే.

 

భారత్‌, చైనాల్లో అత్యధిక సంఖ్యలో డ్యూయల్‌ సిమ్‌ మొబైల్‌ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఐఫోన్‌-8లో డ్యూయల్‌ సిమ్‌ను ఆపిల్‌ పరిచయం చేయనుందట. డ్యూయల్‌ సిమ్‌ టెక్నాలజీకి సంబంధించి యాపిల్‌ ఇటీవలే అమెరికాలో పేటెంట్‌ హక్కులను పొందింది. చైనాలోనూ అనుమతి లభించినట్లు ఆ సంస్థకు చెందిన ఓ అధికారి తాజాగా వెల్లడించారు.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top