పదేళ్ల ఐఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు... | iPhone Turns 10; Apple CEO Tim Cook Says 'Best Is Yet to Come' | Sakshi
Sakshi News home page

పదేళ్ల ఐఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు...

Jan 9 2017 12:22 PM | Updated on Aug 20 2018 2:58 PM

పదేళ్ల ఐఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు... - Sakshi

పదేళ్ల ఐఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు...

2007 జనవరి 7న ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఈ ఫోన్ను ప్రవేశపెట్టారు. శాన్ఫ్రాన్సిస్కో వేదికగా లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొదటి ఐఫోన్. అయితే మొదటి ఐఫోన్ను భారత్లో ప్రవేశపెట్టలేదు.

ఆపిల్ ఐఫోన్ అంటే ఎవరూ తెలియని వారండరేమో.. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రొడక్ట్ తెగ ఫేమస్ అయింది.  కుర్రకారు మదిని ఎక్కువగా దోచుకున్న స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉందా అంటే అది ఐఫోనే. అంతలా ఇష్టపడతారు యువత. ఎలాగైనా ఆపిల్ ఐఫోన్ కొనుక్కోవాలని యువత ఉత్సాహ పడుతుంటారు. కుర్రకారును ఇంతగా ఆకట్టుకున్న ఐఫోన్కు జనవరి 9 అంటే నేడు చాలా స్పెషల్. ఆ స్పెషల్ ఏమిటో తెలుసా? నేటికి ఐఫోన్ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఐఫోన్ నుంచి ఇంకా ఉత్తమమైన స్మార్ట్ఫోన్ రావాల్సిఉందని 10వ వార్షికోత్సవ సందర్భంగా ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ అభిప్రాయం వ్యక్తంచేశారు. అంటే పదేళ్ల వార్షికోత్సవంగా మరో సూపర్ ఐఫోన్ ను మన ముందుకు తీసుకురాబోతున్నారని సిగ్నల్ ఇచ్చేశారు.   
 
10వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఐఫోన్ గురించి మరిన్ని విశేషాలు:
  • 2007 జనవరి 7న ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఈ ఫోన్ను ప్రవేశపెట్టారు. శాన్ఫ్రాన్సిస్కో వేదికగా లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొదటి ఐఫోన్. మొదటి తరం ఐఫోన్ మొదట అమెరికాలోనే ప్రవేశపెట్టారు. 2007 నవంబర్లో యూకే, జర్మనీ, ఫ్రాన్స్లలో ఐఫోన్ను విక్రయించడం ప్రారంభించారు.
  • అయితే మొదటి ఐఫోన్ను భారత్లో ప్రవేశపెట్టలేదు. భారత్లోకి ఐఫోన్ 2008 ఆగస్టులో ప్రవేశించింది. ఐఫోన్ 3జీ  ఫోన్ను మొదట భారత్ లో లాంచ్ చేశారు. వొడాఫోన్, ఎయిర్టెల్ నెట్వర్క్తో భారత్లోకి ప్రవేశించింది. 
  • ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు, దీనికసలు ఎలాంటి యాప్ స్టోర్ లేదు. 
  • స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ను ప్రవేశపెట్టిన కొన్ని రోజులకే సిస్కో దీనిపై దావా వేసింది. 'ఐఫోన్' ట్రేడ్ మార్కు వాస్తవానికి తమదంటూ సిస్కో  ఉత్తర కాలిఫోర్నియా ఫెడరల్ జిల్లా కోర్టులో దావా వేసింది. అనంతరం రెండు కంపెనీలు కూర్చొని ట్రేడ్ మార్కు సమస్యను సెటిల్ చేసుకున్నాయి. 
  • 2016 లో టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన అన్ని సమయాల్లో అత్యంత ప్రభావితమైన 50 గాడ్జెట్ల జాబితాల్లో ఐఫోన్ టాప్లో నిలిచింది. 
  • ఐఫోన్‌ టెక్నాలజీకి సంబంధించిన 200 పేటెంట్ హక్కులు ఆపిల్ వద్ద ఉన్నాయి.
  • 2016 జూన్ నాటికి ఆపిల్ ఐఫోన్ విక్రయాలు 1 బిలియన్(100 కోట్ల) మార్కును చేధించాయి. కూపర్టినోలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఈ విషయాన్ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. 1 బిలియన్ మార్కును కంపెనీ చేధించి, రికార్డు సృష్టించిందని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. 
  • ఐఫోన్ ఫోన్లలో అత్యంత ఖరీదైన భాగమేదంటే అది రెటీనా స్క్రీనే. 
  • 2007 జూన్ నుంచి ఐఫోన్ విక్రయాలు ప్రారంభం అయిన తర్వాత కంపెనీకి ఎక్కువ రెవెన్యూలు ఈ ఫోన్నుంచే వస్తున్నాయి. గత త్రైమాసికంలో(2016 క్యూ4) కంపెనీ రెవెన్యూలో ఐఫోన్ విక్రయాలు 60 శాతం నమోదు అయ్యాయి. ఈ రెవెన్యూలు మరో 14 శాతం పెరిగే అవకాశముందని కంపెనీ వ్యక్తంచేస్తోంది.  
  • ఆపిల్ ఐఫోన్ యాడ్ లో ఎప్పుడూ సమయం 9.41am గానే కనిపిస్తోంది. ఇందుకు కారణం స్టీవ్ జాబ్స్ మొదట ఐఫోన్ ను ఆ సమయంలోనే ప్రవేశపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement