తీస్తా దంపతులకు ఊరట | Interim relief for Teesta, her husband | Sakshi
Sakshi News home page

తీస్తా దంపతులకు ఊరట

Jul 24 2015 6:53 PM | Updated on Apr 7 2019 4:37 PM

నిధుల దుర్వినియోగం కేసులో గుజరాత్కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లకు ఊరట లభించింది.

న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసులో గుజరాత్కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లకు ఊరట లభించింది. శుక్రవారం బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 10 వరకు వారిని అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. తీస్తా దంపతులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఈ రోజు ముంబై సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు.

2002 గుజరాత్ అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలో బాధితుల స్మారకార్ధం మ్యూజియం ఏర్పాటుచేస్తామంటూ సేకరించిన నిధులను సొంతానికి వాడుకున్నారన్న కేసులో సెతల్వాద్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ గత వారం సీబీఐ  సెతల్వాద్ ఇంటిపై దాడులు చేసింది. ఈ నిధులను ఆమె తన మద్యం కోసం, జుట్టు సింగారానికి వాడుకున్నారని ఆరోపించింది. అయితే సెతల్వాద్ దంపతులను బీజేపీ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement