మానభంగం, కిడ్నాప్ కేసులో న్యూజిలాండ్ లో ఎన్నారైకి శిక్ష | Indian-origin man held guilty of raping two women in New Zealand | Sakshi
Sakshi News home page

మానభంగం, కిడ్నాప్ కేసులో న్యూజిలాండ్ లో ఎన్నారైకి శిక్ష

Oct 11 2013 8:32 PM | Updated on Jul 28 2018 8:51 PM

కిడ్నాప్, మానభంగం కేసులో భారత సంతతికి చెందిన ప్రవీణ్ ఫియా హరి ప్రసాద్ కుమార్ న్యూజిలాండ్ కోర్టు జైలుశిక్ష విధించింది.

కిడ్నాప్, మానభంగం కేసులో భారత సంతతికి చెందిన ప్రవీణ్ ఫియా హరి ప్రసాద్ కుమార్ న్యూజిలాండ్ కోర్టు జైలుశిక్ష విధించింది. 2008 లో ఇద్దరు మహిళను కిడ్నాప్ చేసి మానభంగం చేసినట్టు నమోదైన కేసులో పునః విచారణ చేపట్టిన అక్లాండ్ కోర్టు శిక్ష ఖారారు చేసింది.  ఈ కేసులో తీర్పు వెల్లడించిన వెంటనే నిందితుడిని రిమాండ్ లోకి తీసుకున్నారు. వచ్చే డిసెంబర్ లో జైలుశిక్ష అమలు చేస్తారని స్థానిక మీడియా వెల్లడించింది. 
 
మానభంగం కేసులో బెయిల్ బయటకు వచ్చిన నిందితుడు తదుపరి విచారణకు గైర్హాజరు కావడమే కాకుండా.. ఎలక్ట్రానికి మానిటరింగ్ నుంచి తప్పించుకున్నట్టు తెలిసింది. ఇంటర్నెట్ లో ఓ మహిళతో మాట్లాడిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా నిందితుడిపై మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్టు నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement