చిలిపి చేష్టలతో చెరసాల పాలయ్యాడు | Indian jailed for molesting woman in Singapore | Sakshi
Sakshi News home page

చిలిపి చేష్టలతో చెరసాల పాలయ్యాడు

Mar 31 2015 8:53 AM | Updated on Sep 2 2017 11:38 PM

చిలిపి చేష్టలతో చెరసాల పాలయ్యాడు

చిలిపి చేష్టలతో చెరసాల పాలయ్యాడు

సింగపూర్ లో మహిళపై చిలిపి చేష్టలకు దిగి చెరసాలయ్యాడో భారతీయుడు. బస్సులో మగువ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేరానికి మూడు వారాల జైలుశిక్షకు గురయ్యాడు.

సింగపూర్: సింగపూర్ లో మహిళపై చిలిపి చేష్టలకు దిగి చెరసాల పాలయ్యాడో భారతీయుడు. బస్సులో మగువ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేరానికి మూడు వారాల జైలుశిక్షకు గురయ్యాడు. డిపార్ట్ మెంట్ స్టోర్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న నిందితుడు సీతారామన్ రమేష్(32) గత ఏడాది వేర్వేరు సందర్భాల్లో మూడుసార్లు 39 ఏళ్ల మహిళను వేధించినందుకు జిల్లా కోర్టు ఈ శిక్ష విధించింది. గతేడాది జూలై 25న బస్సులో మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని స్థానిక మీడియా తెలిపింది.

ముందుగా చివరి సీటులో కూర్చున్న సీతారామన్ వరుసగా సీట్లు మారుతూ 20 నిమిషాల తర్వాత సదరు మహిళకు చేరువగా వచ్చి చిలిపి చేష్టలకు దిగాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు. అతడు చేసిన నేరానికి రెండేళ్ల జైలు, జరిమానాతో పాటు కొరడా దెబ్బలు కొట్టేవారే. కాని సీతారామన్ పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడని.. చేసిన తప్పుతో ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చిందని కోర్టుకు అతడి తరపు లాయర్ విన్నవించడంతో స్వల్ప శిక్షతో సరిపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement