యూఎస్లో ఎన్నారై విద్యార్థికి జీవిత ఖైదు | Indian-American student sentenced to life for killing friend | Sakshi
Sakshi News home page

యూఎస్లో ఎన్నారై విద్యార్థికి జీవిత ఖైదు

May 28 2015 10:08 AM | Updated on Sep 3 2017 2:50 AM

యూఎస్లో ఎన్నారై విద్యార్థికి జీవిత ఖైదు

యూఎస్లో ఎన్నారై విద్యార్థికి జీవిత ఖైదు

స్నేహితుడి హత్య కేసులో భారతీయ అమెరికన్ ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్ గుప్తాకి జీవిత ఖైదీ విధిస్తూ.. ఆమెరికన్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

వాషింగ్టన్: స్నేహితుడి హత్య కేసులో భారతీయ అమెరికన్ ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్ గుప్తాకి జీవిత ఖైదీ విధిస్తూ.. ఆమెరికన్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.  రాహుల్ గుప్తా జార్జియా వాషింగ్టన్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. జార్జీటౌన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం చదువుతున్న మార్క్ వా (24)  బాల్య స్నేహితులు. అయితే రాహుల్ గర్ల్ ఫ్రెండ్కు మార్క్... చాటింగ్ చేయడం తట్టుకోలే పోయాడు. మార్క్తోపాటు తన గర్ల ఫ్రెండ్ తనను మోసం చేశారని రాహుల్ భావించాడు.

ఆ అక్కసుతో 2013, అక్టోబర్ 13న మార్క్ నివసిస్తున్న అపార్ట్మెంట్కు వెళ్లి అతడిపై దాడి చేసి... 11 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించారు. ఈ కేసులో రాహుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించారు. ఈ కేసు విచారణ భాగంగా రాహుల్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దాంతో ఈ హత్య కేసులో నిందితుడు రాహుల్ అని భావించిన కోర్టు జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు వెలువరించింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement