breaking news
Georgetown University
-
జార్జిటౌన్ వర్సిటీ డైరెక్టర్‌గా హిందూ గురువు
వాషింగ్టన్: అమెరికాలోని జార్జిటౌన్ వర్సిటీలోని హిందూ లైఫ్ విభాగ డైరెక్టర్‌గా తొలిసారి హిందూ మతగురువును నియమించారు. బ్రహ్మచారి వ్రజ్విహారీ శరణ్‌ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు వర్సిటీ మిషన్ అండ్ మినిస్ట్రీ ఉపాధ్యక్షుడు రేవ్ హవార్డ్ గ్రే తెలిపారు. వర్సిటీలోని హిందువుల గొంతుకను వినిపించేందుకు శరణ్‌ను డైరెక్టర్‌గా నియమించామని గ్రే తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. శరణ్ 2015 వరకు ఎడిన్బర్గ్ వర్సిటీలో హిందూ మత గురువుగా పనిచేశారు. -
యూఎస్‌లో ఎన్నారై విద్యార్థికి జీవిత ఖైదు
వాషింగ్టన్: స్నేహితుడి హత్య కేసులో భారతీయ అమెరికన్ ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్ గుప్తాకి జీవిత ఖైదీ విధిస్తూ.. ఆమెరికన్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రాహుల్ గుప్తా జార్జియా వాషింగ్టన్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. జార్జీటౌన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం చదువుతున్న మార్క్ వా (24) బాల్య స్నేహితులు. అయితే రాహుల్ గర్ల్ ఫ్రెండ్‌కు మార్క్... చాటింగ్ చేయడం తట్టుకోలే పోయాడు. మార్క్‌తోపాటు తన గర్ల ఫ్రెండ్ తనను మోసం చేశారని రాహుల్ భావించాడు. ఆ అక్కసుతో 2013, అక్టోబర్ 13న మార్క్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అతడిపై దాడి చేసి... 11 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించారు. ఈ కేసులో రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించారు. ఈ కేసు విచారణ భాగంగా రాహుల్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దాంతో ఈ హత్య కేసులో నిందితుడు రాహుల్ అని భావించిన కోర్టు జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు వెలువరించింది.