తాజ్ పరిసరాల్లో పిడకల వంట నిషేధం | India bans burning cow dung near Taj Mahal | Sakshi
Sakshi News home page

తాజ్ పరిసరాల్లో పిడకల వంట నిషేధం

Jan 14 2015 3:46 AM | Updated on Sep 2 2017 7:39 PM

తాజ్ పరిసరాల్లో పిడకల వంట నిషేధం

తాజ్ పరిసరాల్లో పిడకల వంట నిషేధం

తాజ్‌మహల్ సమీపంలో పిడకలతో వంట చేయడాన్ని ఆగ్రా డివిజినల్ కమిషనర్ ప్రదీప్ భట్నాగర్ మంగళవారం నిషేధించారు.

లక్నో: తాజ్‌మహల్ సమీపంలో పిడకలతో వంట చేయడాన్ని ఆగ్రా డివిజినల్ కమిషనర్ ప్రదీప్ భట్నాగర్ మంగళవారం నిషేధించారు. చిన్న చిన్న పరిశ్రమల్లో బొగ్గు వాడకాన్ని నిషేధించడంపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఇటీవల ఓ అమెరికన్ జర్నల్ గాలిలోని కార్బన్ వల్లనే తాజ్‌మహల్ రంగు పసుపుగా మారుతోందని తన పరిశోధనలో పేర్కొనడంతోపిడకలపై నిషేధం విధిస్తున్నామని భట్నాగర్ చెప్పారు. దీనివల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వారికి ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement