ఆ ఒక్క'టీ' భారత్-ఎదే | India-A won over west indies-A | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క'టీ' భారత్-ఎదే

Sep 21 2013 3:27 PM | Updated on Sep 1 2017 10:55 PM

ఆ ఒక్క'టీ' భారత్-ఎదే

ఆ ఒక్క'టీ' భారత్-ఎదే

వెస్టిండీస్-ఎతో వన్డే సిరీస్ను భారత్-ఎ ఓడిపోయినా ఏకైక అనధికారిక టి-20 మ్యాచ్లో ఘనవిజయం సాధించింది.

వెస్టిండీస్-ఎతో వన్డే సిరీస్ను భారత్-ఎ ఓడిపోయినా ఏకైక అనధికారిక టి-20 మ్యాచ్లో ఘనవిజయం సాధించింది. యువరాజ్ సింగ్ (35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52; 2/24) ) ఆల్రౌండ్ షోతో పాటు రాహుల్ శర్మ (5/23) సూపర్ స్పెల్తో విజృంభించడంతో భారత్-ఎ 93 పరుగులతో విండీస్ను చిత్తుచేసింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ను భారత బౌలర్లు 16.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూల్చారు. విండీస్ జట్టులో ఆండ్రీ ఫ్లెచర్ (32) టాప్ స్కోరర్. భారత యువ బౌలర్ రాహుల్ అద్భుతంగా బౌలింగ్ చేయగా, వినయ్ కుమార్, యువరాజ్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు.
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువీతో పాటు ఉన్ముక్త్ చంద్ (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47), కేదార్ జాదవ్ (21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42), రాబిన్ ఊతప్ప (21 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 35) దూకుడుగా ఆడారు. ఓపెనర్లు ఊతప్ప, చంద్ 40 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టకు శుభారంభం అందించారు. ఈ జోడీ వెనుదిరిగాక యువీ, జాదవ్ అదే జోరు కొనసాగించారు. కాగా అపరాజిత్ (3), యూసుఫ్ (0), నమన్ ఓజా (0) నిరాశపరిచినా చివర్లో సుమీత్ నర్వాల్ (7 బంతుల్లో ఫోర్, సిక్సర్తో 18 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు 200 దాటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement