కేంద్ర మాజీ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు | Income tax raids on former union minister jagadrakshakan | Sakshi
Sakshi News home page

కేంద్ర మాజీ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు

Jul 13 2016 8:38 PM | Updated on Sep 4 2017 4:47 AM

కేంద్ర మాజీ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు

కేంద్ర మాజీ మంత్రి ఇంట్లో ఐటీ సోదాలు

డీఎంకేకు చెందిన కేంద్ర మాజీమంత్రి జగద్రక్షకన్ ఆస్తులపై బుధవారం ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది.

సాక్షి, చెన్నై: డీఎంకేకు చెందిన కేంద్ర మాజీమంత్రి జగద్రక్షకన్ ఆస్తులపై బుధవారం ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని 40 చోట్ల ఈ దాడులు జరిగాయి. డీఎంకేకు చెందిన జగద్రక్షకన్ యూపీఏ-2లో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.

ఆయన ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించిన ఆ శాఖ వర్గాలు బుధవారం ఏకకాలంలో సోదాలు చేశాయి. అడయార్‌లోని ఆయన నివాసం, చెన్నై నగర శివారుల్లోని బాలాజీ మెడికల్ కళాశాల, ఠాకూర్ ఇంజినీరింగ్ కళాశాల, భారత్ వర్సిటీ, పుదుచ్చేరిలోని లక్ష్మీనారాయణ ఇంజినీరింగ్ కళాశాల, హోటళ్లతో పాటు 40 చోట్ల ఈ సోదాలు కొనసాగాయి. కీలక రికార్డులను ఐటీ వర్గాలు తీసుకెళ్లాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement