ఇళయరాజాకు అస్వస్థత | Ilayaraja hospitalised | Sakshi
Sakshi News home page

ఇళయరాజాకు అస్వస్థత

Aug 17 2015 2:52 AM | Updated on Sep 3 2017 7:33 AM

ఇళయరాజాకు అస్వస్థత

ఇళయరాజాకు అస్వస్థత

ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా(72) అస్వస్థతతో ఇక్కడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా(72) అస్వస్థతతో ఇక్కడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గుండె సంబంధ అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఒంట్లో నలతగా ఉండడంతో శుక్రవారం ఆయన ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనకు గుండె, జీర్ణాశయానికి సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించారు.  ఇళయరాజా ఇదివరకు గుండెకు సర్జరీ చేయించుకున్నారు.

ఆయన ఇటీవల యూట్యూబ్‌లో సొంత మ్యూజిక్ చానల్‌ను, ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారని, ఆ సందర్భంగా పలు టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అధికంగా మాట్లాడ్డంతో అనారోగ్యానికి గురై ఉండొచ్చని సినీ వర్గాలు చెప్పాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement