ఐగేట్ సీఈఓ అశోక్ వేమూరికి ఇన్ఫీకంటే రెట్టింపు ప్యాకేజీ | iGate new CEO Ashok Vemuri's 'fat' pay packet | Sakshi
Sakshi News home page

ఐగేట్ సీఈఓ అశోక్ వేమూరికి ఇన్ఫీకంటే రెట్టింపు ప్యాకేజీ

Sep 18 2013 2:16 AM | Updated on Sep 1 2017 10:48 PM

ఐగేట్ సీఈఓ అశోక్ వేమూరికి ఇన్ఫీకంటే రెట్టింపు ప్యాకేజీ

ఐగేట్ సీఈఓ అశోక్ వేమూరికి ఇన్ఫీకంటే రెట్టింపు ప్యాకేజీ

యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సంస్థ ఐగేట్‌కు కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ వేమూరి భారీగా లబ్ధి పొందనున్నారు.

ముంబై: యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సంస్థ ఐగేట్‌కు కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ వేమూరి భారీగా లబ్ధి పొందనున్నారు. ఇన్ఫోసిస్‌లో పొందిన జీతంతో పోలిస్తే భారీ ప్యాకేజీ లభించనుంది. ప్రాథమిక జీతం 1.3 మిలియన్ డాలర్ల(రూ. 8.2 కోట్లు)తోపాటు, మరో మిలి యన్ డాలర్ల(రూ. 6.3 కోట్లు) వరకూ వార్షిక నగదు బోనస్‌గా వేమూరి అందుకోనున్నారు. కాగా, ఇంతక్రితం ఇన్ఫోసిస్‌కు చెందిన అమెరికా మాన్యుఫాక్చరింగ్, ఇంజనీరింగ్ విభాగానికి గ్లోబల్ హెడ్‌గా విధులు నిర్వర్తించిన వేమూరికి 2012-13లో ప్రాథమిక జీతం కింద రూ. 3.89 కోట్లు, బోనస్‌గా రూ. 1.02 కోట్లు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement