ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి రికవరీ ఫండ్ సిరీస్ 2 | ICICI Prudential India Recovery Fund Series 2 | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి రికవరీ ఫండ్ సిరీస్ 2

Mar 29 2015 12:13 AM | Updated on Sep 2 2017 11:31 PM

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తాజాగా ఇండియా రికవరీ ఫండ్ సిరీస్ 2ను ప్రవేశపెట్టింది.

 హైదరాబాద్: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తాజాగా ఇండియా రికవరీ ఫండ్ సిరీస్ 2ను ప్రవేశపెట్టింది. 3.5 సంవత్సరాల వ్యవధి గల ఈ క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్ దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువైనదని సంస్థ తెలిపింది. రాబోయే 3-5 సంవత్సరాల్లో దేశీ ఎకానమీ మరింత పుంజుకుంటుందన్న అంచనాల కారణంగా.. షేర్లు తదితర సాధనాల్లో ఈ ఫండ్ నిధులను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ సీఈవో నిమేష్ షా పేర్కొన్నారు. ఇందులో కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement