జియో సపోర్ట్తో ఐ-బాల్ కొత్త ట్యాబ్లెట్ | iBall Slide Q27 4G Tablet With Reliance Jio Support Launched at Rs. 12,799 | Sakshi
Sakshi News home page

జియో సపోర్ట్తో ఐ-బాల్ కొత్త ట్యాబ్లెట్

Oct 18 2016 12:58 PM | Updated on Sep 4 2017 5:36 PM

జియో సపోర్ట్తో  ఐ-బాల్ కొత్త ట్యాబ్లెట్

జియో సపోర్ట్తో ఐ-బాల్ కొత్త ట్యాబ్లెట్

ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఐ-బాల్‌ సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. రిలయన్స్ జియో సపోర్ట్ చేసే 4 జీ ట్యాబ్లెట్ ను 'స్లైడ్ క్యూ 27' పేరుతో విడుదల చేసింది

ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఐ-బాల్‌ సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లో లాంచ్  చేసింది.  రిలయన్స్ జియో  సపోర్ట్ చేసే 4 జీ ట్యాబ్లెట్  ను 'స్లైడ్ క్యూ 27' పేరుతో  విడుదల చేసింది.  దీని ధరను రూ.12,799 గా కంపెనీ నిర్ణయించింది. ఈ టాబ్లెట్ లు ఇప్పటికే మార్కెట్ లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.

స్లైడ్ క్యూ 27'  ఫీచర్స్

10.10 అంగుళాల డిస్ ప్లే
1.3గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0
800x1280పిక్సెల్స్ రిజల్యూషన్
2ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5ఎంపి రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
 2జీబీ ర్యామ్  
16జీబీ స్టోరేజ్
32జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ
5500ఎంఏహెచ్ బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
Advertisement